Thursday, May 2, 2024

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు, జూన్ 20లోపు ఫ‌లితాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్‌ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు మే 6న ప్రారంభమై ఈనెల 24తో ముగిశాయి. అయితే ప్రశ్నపత్రాల్లో అక్షర దోషాలు, చేతి రాతతో రాసిన ప్రశ్నపత్రాల పంపిణీ ఇలా పలురకాల తప్పిదాలతో ఈసారి జరిగిన ఇంటర్‌ పరీక్షలు వార్తల్లో నిలిచాయి. మంగళవారం నాడు సెకండియర్‌ మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2 పరీక్షను విద్యార్థులు రాశారు. మొత్తం 505 విద్యార్థులకు 495 విద్యార్థులు హాజరయ్యారు.

పరీక్షలు సజావుగా జరిపేందుకు సహకరించిన తల్లిదండ్రులకు, సంబంధిత శాఖల అధికారులకు ఇంటర్‌ బోర్డు సెక్రటరీ ఉమర్‌ జలీల్‌ ఈమేరకు ధన్యవాదాలు తెలిపారు. జూన్‌ 20లోపు పరీక్ష ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇక నూతన విద్యా సంవత్సరం జూన్‌ 15 నుంచి ప్రారంభం కానుంది. సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు జూన్‌ 15 నుంచి, ఫస్ట్‌ ఇయర్‌ వారికి జూలై 1 నుంచి తరగతులు పున:ప్రారంభం కానున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement