Saturday, April 27, 2024

ఈ వారంలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు ఈ వారంలో వెలువడనున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనం ఇంకా పూర్తి కాలేదు. మరో రెండ్రోజులు పట్టే అవకాశం ఉండడంతో అవి పూర్తి చేసిన తర్వాత రెండు మూడు రోజుల్లో ఫలితాలను వెలువరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో ఈనెల 7వ తేదీలోపు ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సప్లిమెంటరీ పరీక్షలకు ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులు మొత్తం కలిపి 4,12,325 మంది హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement