Monday, April 29, 2024

ప్రేరణ నింపిన ప్రేరణ-2023 : సీపీ సుబ్బారాయుడు

వ్యసనాలకు బానిసైన యువకులు వివిధ నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో మార్పుతేవడం, రుణయాప్‌ల మోసాలు, సైబర్‌ క్రైం ఘటనలు, కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్ శ్రీకారం చుట్టిన ప్రేరణ 2023 స్పూర్తి దాయకంగా నిలిచింది. అల్ఫోర్స్‌ విద్యా సంస్థలు, శియాన్‌ మీడియా సంస్థల సహకారంతో అల్గునూర్‌ ఉన్నతి కన్వెన్షన్‌లో కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రంగాల్లో ఉన్నతులుగా ఎదిగిన వారి జీవితగాథలతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి అవగాహన కల్పించడంతోపాటు కమిషనరేట్‌ వ్యాప్తంగా లక్షమందికి పైగా ఎల్‌ఈడీ స్క్రీన్లపై లైవ్‌లో వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కరీంనగర్ సీపీ సుబ్బరాయుడును అతిథులు ప్రశంసించారు. నేటి సమాజంలో యువత, విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన మెజార్టీ వ్యక్తులు వ్యసనాలకు బానిసగా మారుతున్నారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తూ అనారోగ్యం బారినపడుతున్నారు. ఇంకా రుణయాప్‌ల మోసాలు, సైబర్‌ క్రైమ్‌కు బలవుతున్నారు. ఇలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు ‘ప్రేరణ 2023’ చేప‌ట్టామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం చరిత్రలో నిలిచిపోయే విధంగా సాగింద‌న్నారు. వివిధ రంగాల్లో సక్సెస్‌ సాధించిన వారి జీవిత గాథలపై అవగాహన కల్పించి చైతన్యం నింపామ‌న్నారు. ఇది యువత మేలు కోసం ఏర్పాటు చేసిందని సీపీ సుబ్బారాయుడు తెలిపారు. యువతను సన్మార్గంలో నడిపించి, భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రేరణ కలిగించమన్నారు.

లక్ష మందికి పైనే వీక్షించారు.
అల్గునూరులోని ఏఎమ్మార్‌ ఉన్నతి కన్వెన్షన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనరేట్‌ వ్యాప్తంగా ఉన్న డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడికల్‌, పీజీ కాలేజీలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు హాజరైనరు. ఉదయం 11 నుంచి సాయంత్రం
వరకు కార్యక్రమాలు, వివిధ రంగాల్లో సక్సెస్‌ సాధించిన ప్రముఖులతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జూమ్‌ యాప్‌ ద్వారా లక్ష మందిని భాగస్వామ్యం చేసేలా కళాశాలలు, వివిధ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్రీన్లను ఏర్పాటు చేశారు.

దిశనిర్దేశనం చేసిన ప్రముఖులు
కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు అధ్యక్షతన జరిగిన ప్రేరణ కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించి విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. వివిధ రంగాల్లో సక్సెస్‌ సాధించిన ప్రముఖులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, మానసికవేత్తలు పాల్గొన్నారు. నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్‌, అనీల్‌ రాచమల్ల, మిథున్‌ కుమార్‌, కే అంకిత్‌, గంప నాగేశ్వరరావు, కెప్టెన్‌ మధుసూదన్‌ రెడ్డి, తోట మురళి తదితరులు హాజరై వివిధ రకాల అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ (శాంతి భద్రతలు) ఎస్‌.శ్రీనివాస్‌, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్‌ రావు, పీ.ప్రతాప్‌, ఎస్‌బీఐ జీ వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్లు లక్ష్మీబాబు, దామోదర్‌ రెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement