Saturday, April 27, 2024

మీరాబాయి ఛానూకు మరో బంపర్ ఆఫర్.. లైఫ్ టైమ్ సినిమా టిక్కెట్లు ఉచితం

ఒలింపిక్స్‌లో పతకం గెలిస్తే జీవితమే మారిపోతుంది అనడానికి టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన మీరాబాయి ఛానూనే ఉదాహరణ. భారత్‌కు వెండి పతకం సాధించిపెట్టిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి ఛానూపై బహుమతుల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా ఓ మ‌ల్టీప్లెక్స్ సంస్థ మీరాబాయికి జీవిత‌కాలం ఫ్రీగా సినిమా టికెట్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఆమె ఎన్ని సినిమాలు చూసినా అన్నీ ఉచితంగా ఇస్తామని ఐనాక్స్ మల్టీప్లెక్స్ సంస్థ చెప్పింది.

అయితే కేవలం మీరాబాయికే కాదు.. ఈ ఒలింపిక్స్‌లో మెడ‌ల్‌తో ఇంటికి వ‌చ్చే ప్ర‌తి భార‌త అథ్లెట్‌కు ఇదే ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని ఐనాక్స్ స్ప‌ష్టం చేసింది. దేశంలో ఐనాక్స్‌కు మొత్తం 648 మ‌ల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. ఈ విష‌యాన్ని ఐనాక్స్ త‌న ట్విట‌ర్‌ ద్వారా తెలిపింది. ఇప్పటికే మీరాబాయికి డోమినోస్ పిజ్జా సంస్థ లైఫ్ టైమ్ పిజ్జాలు ఉచితంగా ఇస్తామని ప్రకటించగా.. మరోవైపు రైల్వే శాఖ రూ.2 కోట్లు, మ‌ణిపూర్ ప్ర‌భుత్వం రూ.కోటి క్యాష్ ప్రైజ్‌లు ప్ర‌క‌టించాయి.

ఈ వార్త కూడా చదవండి: రెండో టీ20లో భారత్‌పై శ్రీలంక విజయం.. సిరీస్ సమం

Advertisement

తాజా వార్తలు

Advertisement