Thursday, May 9, 2024

INDvsSA | తొలి టెస్టుకు ముందు రోహిత్ శ‌ర్మ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్..

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు.. రేపు సెంచూరియన్‌ వేదికగా సఫారీలతో తొలి టెస్టు ఆడనుంది. కాగా, ఈ నేపథ్యంలో తొలిటెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మూడు దశాబ్దాలుగా దక్షిణాఫ్రికా గడ్డమీద టెస్టులు ఆడుతున్నా ఇంతవరకూ ఇక్కడ టెస్టు సిరీస్‌ గెలవని భారత్‌.. ఈసారి ఎలాగైనా గెలిచితీరాలనే పట్టుదలతో ఉందని హిట్‌మ్యాన్‌ చెప్పాడు. తమ మొదటి ప్రాధాన్యత అదేనని అన్నాడు.

ఈ సిరీస్‌ నుంచి గాయం కారణంగా మహ్మద్‌ షమీ తప్పుకోవడం భారత్‌కు భారీ నష్టమని, అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని హిట్‌మ్యాన్‌ చెప్పాడు. తొలి టెస్టులో కెఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపర్‌గా ఉండనున్నాడని, అతడు ఎన్నిరోజులు ఇలా డ్యూయల్‌ రోల్‌ పోషిస్తాడో తనకూ తెలియదని, కానీ ఇప్పటికైతే అతడు మెరుగ్గా ఆడుతున్నాడని తెలిపాడు.

ఇక‌, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లు తొలి టెస్ట్ ఆడబోతున్నారని రోహిత్ శర్మ ధృవీకరించారు. మూడో పేస‌ర్‌గా ఎవ‌రు ఉంటారు అనే విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు. ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ ల‌లో ఒకరు తుది జ‌ట్టులో ఉంటార‌నే విష‌యాన్ని మాత్రం చెప్పాడు. ఈ ఇద్ద‌రిలో మూడో పేస‌ర్‌గా ఎవ‌రు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తారు అనే విష‌యాన్ని టీమ్ మీటింగ్‌లో నిర్ణ‌యిస్తామ‌ని తెలిపాడు. మ‌హ్మ‌ద్ ష‌మీ లేక‌పోవ‌డం లోటేన‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement