Sunday, May 5, 2024

Komatireddy Brothers – బిఆర్ఎస్ నేత‌లు జైలు కెళ్ల‌డం ఖాయ‌మ‌న్న అన్న‌…. ఆ పార్టీ క‌నుమ‌ర‌గ‌వుతుందన్న త‌మ్ముడు ..

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ నేతలపై ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని.. అన్ని ప్రభుత్వ శాఖలను అప్పుల కుప్పగా మార్చిందని ధ్వజమెత్తారు. అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలు త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై వేసిన సిట్టింగ్ జడ్జి విచారణ నివేదిక రాగానే యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఇకపై ఉండదని ఆ పార్టీ నాలుగు ముక్కులు అవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని కోమటిరెడ్డి దీమా వ్యక్తం చేశారు.

కాగా, ఇవాళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పార్టీపై ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌ను ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రానివ్వబోము అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాబోతోందని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పని అయిపోయిందని.. ఉనికి కాపాడుకోవడానికి ఆ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, కానీ, అదంతా వృథాగా మిగిలిపోనుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల అనంతరం రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని, కేటీఆర్ మళ్లీ అమెరికాకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయిస్తుందని అన్నారు. కేసీఆర్ కుటుంబంపై త్వరలోనే విచారణ జరుపుతామని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement