Monday, May 20, 2024

జీ-20 సదస్సుకు రండి, పుతిన్‌, జెలెన్‌స్కీలకు ఇండోనేషియా ఆహ్వానం

నవంబర్‌లో జరిగే జి-20 సదస్సుకు రావాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీలను ఆహానించినట్లు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడో తెలిపారు. జి-20 సదస్సుకు ఈసారి ఇండోనేషియా నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో తటస్థ వైఖరిని. నిష్పాక్షిక ధోరణిని అవలంబిస్తున్నామని విడొడొ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన నేపథ్యంలో జి-20నుంచి రష్యాను దూరంగా ఉంచాలన్న సభ్యదేశాల వైఖరికి భిన్నంగా ఇండోనేషియా పుతిన్‌ను ఆహానించడం విశేషం. కాగా ఉక్రెయిన్‌కు ఆహానించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ అంగీకరించారు. కాగా జి-20 సదస్సుకు విడొడో ఆహానించారని, తాను హాజరవుతానని పుతిన్‌ స్వయంగా ప్రకటించారు. గురువారంనాడు విడొడో పుతిన్‌తో భేటీ అయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement