Sunday, April 28, 2024

లక్ష కోట్ల ఎయిర్‌లైన్‌గా ఇండిగో.. దేశంలో మొదటి విమానయాన సంస్థగా గుర్తింపు

దేశంలోనే లక్షల కోట్ల విలువైన సంస్థగా ఇండిగో అవతరించింది. ఈ ఘనత సాధించిన మొదటి ఇండియన్‌ ఎయిర్‌లైన్‌గా గుర్తింపు పొందింది. బుధవార ం నాడు ఇండిగో షేర్లు 4 శాతం లాభపడ్డాయి. 2023లో ఇప్పటి వరకు చూస్తే సంస్థ షేర్ల ధర 28 శాతం పెరిగింది. మంగళవారం నాడు సంస్థ షేరు 2,529.95 రూపాయల వద్ద ముగిసింది. బుధవారం నాడు ఇది 2,619.85 రూపాయలకు చేరింది. గోఫస్ట్‌ సంస్థ దివాల పిటిషన్‌ దాఖలు చేసిన తరువాత ఇండిగో షేర్లు వేగంగా పెరుగుతున్నాయి.
ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబల్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌ దేశంలో మొదటి లక్ష కోట్ల మార్కెట్‌ సంపద కలిగినదిగా అవతరించింది.

బుధవారం నాటికి స్టాక్‌మార్కెట్‌ షేర్ల ధరలతో కంపెనీ విలువ 1,01,007.56 కోట్లుగా ఉంది. ఈ నెలలోనే ఇండిగో దేశంలో అత్యధికంగా ఒకేసారి 500 విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది. 2035 నాటికి ఈ కొత్త విమానాలు సంస్థకు అందుబాటులోకి రానున్నాయి. వీటి కొనుగోలుకు ఇండిగో 50 బిలియన్‌ డాలర్లు వ్యయం చేయనుంది. ఇది ఎవియేషన్‌ చరిత్రలోనే అతి పెద్ద కొనుగోలుగా రికార్డ్‌ తో పాటు ఇంత వరకు ఎయిర్‌బస్‌ కంపెనీకి వచ్చిన అతి పెద్ద సింగిల్‌ ఆర్డర్‌కూడా ఇదే.

Advertisement

తాజా వార్తలు

Advertisement