Saturday, April 27, 2024

18న భారత్‌- న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌.. హైదరాబాద్‌ వేదికగా పోరు

ఈ నెల 18న ఉప్పల్‌లో భారత్‌- న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ బీఆర్‌కే భవన్‌ (తెలంగాణా సచివాలయం)లో ఉన్నతాధికారులను కలిశారు. మ్యాచ్‌ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. భారత్‌లో న్యూజిలాండ్‌ జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 18న ప్రారంభం కాబోయే మొదటి వన్డే మ్యాచ్‌కు హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం(ఉప్పల్‌ స్టేడియం) ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక రెండో మ్యాచ్‌ 21న రాయ్‌ పూర్‌లో , మూడో వన్డే 24న ఇండోర్‌ స్టేడియంలో జరగనున్నాయి. టీ 20 సిరీస్‌ 27న రాంచీ, 29న లక్నో, ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్నాయి. ఇక హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత మ్యాచ్‌ జరగనుంది. చివరి వన్డేమ్యాచ్‌ 2019, మార్చి 2న భారత్‌ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. అభిమాన క్రికెటర్ల ఆటను మైదానంలో ప్రత్యక్షంగా వీక్షిద్దామనుకున్న సగటు ప్రేక్షకులు నిరాశ చెందారు.

జింఖానా మైదానం వద్ద తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌ సీ ఏతో పాటు ప్రభుత్వ ఇటీవల ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య టీ 20 మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ టికెట్ల జారీ విషయంలో పెద్ద ఎత్తున గందరగోళం జరిగింది. అభిమాన క్రికెటర్ల ఆటను మైదానంలో ప్రత్యక్షంగా వీక్షిద్దామనుకున్న సగటు ప్రేక్షకులు నిరాశ చెందారు. జింఖానా మైదానం వద్ద తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌సీఏతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యమేనని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్‌ ఏర్పాట్ల విషయంలో హెచ్‌సీఏ పూర్తి వైఫల్యం చెందిందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఎలాంటి ఘటనలు జరగకుండా హెచ్‌సీఏ జాగ్రత్త పడుతుందని తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరిగేమ్యాచ్‌కోసం హైద్రాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఏర్పాట్లు చేస్తున్నది.

- Advertisement -

ఈ సందర్భంగా గురువారం నుంచి భారత్‌- న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ తెలిపారు. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లను విక్రయిస్తున్నామని, ఆఫ్‌ లైన్‌లో విక్రయించడం లేదని స్పష్టం చేశారు. అయితే ఫిజికల్‌ టికెట్‌ ఉంటేనే స్టేడియంలోకి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. జనవరి 15 నుంచి 18 వరకు భౌతికంగా టికెట్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఎల్‌బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాల్లో టికెట్లు జారీ చేయనున్నట్టు ప్రకటించారు. ఆఫ్‌లైన్‌లో టికెట్లు అమ్మడం లేదని , బ్లాక్‌ టికెట్ల అమ్మకాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement