Sunday, April 28, 2024

Atal Setu: ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. ప్ర‌ధాని మోడీ

ప్ర‌పంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్ అవ‌త‌రించింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. మహారాష్ట్రలోని ముంబయి నగరంలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయగఢ్ జిల్లాలోని సహవా శేవాను కలుపుతూ 17వేల 840 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆరు లైన్లుగా నిర్మించారు. ఇక, 2016 డిసెంబర్ నెలలో ప్రధాని మోడీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గౌరవార్ధం ఈ బ్రిడ్జ్ కు అటల్ సేతు అని నామకరణం చేశారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాసిక్ కాలారామ్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంత‌రం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇవాళ నాసిక్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.. అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ నాసిక్ లో ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. పంచవటి ప్రాంతంలో సీతారాములు చాలా కాలం ఉన్నారన్నారు.. అన్ని ఆలయాల్లో పరిశుభ్ర‌త‌ క్యాంపైన్ ను మొదలి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారన్నారు. టెక్నాలజీ రంగంలో భారత్ వృద్ధి సాధిస్తుందని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement