Friday, April 26, 2024

దేశంలో నిలకడగా కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 33,376 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,08,330కు చేరింది. ఇందులో 3,91,516 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,42,317 మంది బాధితులు మరణించారు. మరో 3,23,74,497 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 308 మంది మరణించారని, 32,198 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారని తెలిపింది.

మరోవైపు కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా 73,05,89,688 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 65,27,175 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని తెలిపింది. కాగా, సెప్టెంబర్‌ 10 వరకు మొత్తం 54,01,96,989 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) వెల్లడించింది. శుక్రవారం 15,92,135 మందికి పరీక్షలు చేశామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement