Friday, April 19, 2024

విఘ్నాలు లేకుండా పూజ చేద్దాం

ప్రసన్న వదనం ధ్యాయేత్‌..సర్వ విఘ్నోపశాంతయే..! ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా.. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలనుకుంటాం. అందుకోసం విఘ్నేశ్వరుడికి తొలిపూజ చేస్తాం. వినాయక పూజ అంటే ప్రకృతి ఆరాధనే! ప్రకృతి దేవాయ నమః.. గణపతి అంటే ప్రకృతి దేవుడే! ప్రకృతి ఆరాధనే స్వభావం కల్గిన దైవం విఘ్నేశ్వరుడు! వినాయక చవితి సందర్భంగా.. ఆ గణపతి పూజలోని కొలువైన ప్రకృతి ఆరాధన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గణపతి అంటే ప్రకృతి దేవుడే
ఈరోజు కృత్రిమ రసాయనాలతో చేసే విగ్రహాలకు గుడ్‌బై చెప్పి..వరసిద్ధి వినాయక వ్రతంలో చెప్పినట్లుగా.. పుట్టమన్ను లేదా చెరువు మట్టితో చేసిన ప్రతిమను పూజించాలి. ఔషధ గుణాలతో కూడిన ధవనం, మారేడు, మామిడి, దేవదారు, విష్ణుక్రాంత తదితర 21 పత్రాలతో పూజించడం వినాయకునికి ప్రీతికరం! మరీ ముఖ్యంగా గరిక పూజ గణపతికి ఇష్టం!

లంబోదరడికి ఇష్టమైనవి ఏమిటి?
బియ్యం పిండితో చేసే ఉండ్రాళ్లు, కుడుములు. ఈ ప్రసాదాలన్నీ ప్రకృతికి ప్రతీకలే. ధాన్యం, బియ్యం పిండి, 21 రకాల ఔషధ పత్రాలు, గరిక వంటి ప్రకృతి పదార్థాలతోనే విఘ్నాధిపతికి అర్చన సాగుతుంది. పండుగలలో తొలి పండుగైన వినాయక చవితి వేళ మన జీవితాల్లో విజయాల కోసం అంతా నిశ్చల భక్తి శ్రద్ధలతో ఆ ప్రకృతి దైవమైన గణపతిని మనసారా ఆరాధిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. లంబోదరుడు మనకు అన్నింటా విజయాన్ని అందించాలని కోరుకుందాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement