Sunday, May 5, 2024

INDvsIRE | టీమిండియా ఆల్‌రౌండ్ ప‌ర్ఫామెన్స్.. ఐర్లాండ్‌పై భారత్ విజ‌యం

డబ్లిన్‌ వేదిక‌గా ఐర్లాండ్‌తో జ‌రుగుతున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భార‌త్ 2-0 తో సిరీస్ ని సోంతం చేసుకుంది. ఇవ్వాల (ఆదివారం) జ‌రిగిన‌ రెండో టీ20 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన‌ భార‌త్ ఐర్లాండ్ ముంది 185 ప‌రుగుల భారీ టార్గెట్ ని సెట్ చేసింది. ఇక ఆ త‌రువాత చేజింగ్ కి దిగిన ఐర్లాండ్ జ‌ట్టుని 152 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేశారు భార‌త బౌల‌ర్లు. దీంతో 33 పగులు తేడాతో ఐర్లాండ్ పై విజ‌యం సాంధించింది భార‌త జ‌ట్టు. ఇక ఐర్లాండ్ పై ఈ విక్ట‌రీతో సిరీస్ ని 2-0 ఆధిక్యంతో త‌న ఖాతాలో వేసుకుంది టీమిండియా.

ఇక భార‌త్ బ్యాట‌ర్లు రుతురాజ్ గైక్వాడ్ (58) తన రెండవ T20I అర్ధ సెంచరీతో చెలరేగగా, సంజు శాంసన్ (40), రింకు సింగ్ (38) కీలకమైన నాక్స్‌తో ఐర్లాండ్ ముందు భారీ టార్గెట్ ని సెట్ చేశారు.

ఐర్లాండ్ తరఫున బారీ మెక్‌కార్తీ రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో.. తొలి టీ20లో డీఎల్ఎస్ ప్రకారం గెలిచిన‌ భార‌త్ ఈ మ్యాచ్ కూడా గెల‌వ‌డంతో 2-0 తో సిరీస్ ని ద‌క్కించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement