Wednesday, May 15, 2024

ఘనంగా నందమూరి సుహాసిని తనయుడి హర్ష వివాహం

హైదరాబాద్: దివంగత సినీనటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని తనయుడైన హర్ష వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో కుటుంబసభ్యులతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ప్రముఖ సినీటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తోపాటు ాయన కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement