Saturday, May 4, 2024

పెరిగిన సీఫుడ్‌ ఎగుమతులు..

మన దేశం నుంచి సముద్ర ఉత్పత్తులు పెరిగాయి. దేశ సీ ఫుడ్‌ ఉత్పత్తులు 4.31 శాతం పెరిగి 8.09 బిలియన్‌ డాలర్లకు చేరాయని కేంద్ర వాణిజ్య శాఖ బుధవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. 2021-22 సంవత్సరంలో మన దేశం నుంచి 13,69,264 టన్నుల సీఫుడ్‌ ఎగుమతి అయ్యింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఎగుమతులు 17,35,286 టన్నులకు చేరాయని పేర్కొంది. ప్రొజన్‌ రోయ్యల ఎగుమతులు వీటిలో ప్రధానమైనవని వాణిజ్య శాఖ తెలిపింది.

- Advertisement -

రోయ్యలు పరిమాణంలోనూ, విలువలోనూ అగ్రస్థానంలో ఉన్నాయి. మన దేశం నుంచి యూనిటైట్‌ అరబ్‌ ఎమరేట్స్‌(యూఏఈ) చైనా ప్రధాన అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, సౌత్‌ఈస్ట్‌ ఏషియా, జపాన్‌ ప్రధాన దిగుమతిదారులుగా ఉన్నాయి. 2022-23లో 5.48 బిలియన్‌ డాలర్ల విలువైన రోయ్యలను మన దేశం ఎగుమతి చేసింది. మన దేశ మొత్తం సీఫుడ్‌ ఎగుమతుల్లో ఇది 41 శాతమని పేర్కొంది.

సీఫుడ్‌ ఎగుమతుల్లో బ్లాక్‌ టైగర్‌ రొయ్యలు, ఇతర రొయ్యలు, ఘనీభవించిన చేపలు, అక్టోపస్‌ వంటివి ప్రధానంగా ఉన్నాయి. మన దేశం నుంచి అమెరికా అత్యధికంగా 263 బిలియన్‌ డాలర్ల విలువైన సీఫుడ్‌ను దిగుమతి చేనుకుంది. ఆర్ధిక మందగమనం మూలంగా 2022-23లో అమెరికాకు జరిగిన సీఫుడ్‌ ఎగుమతుల్లో 21.93 శాతం తగ్గినట్లు వాణిజ్యశాఖ తెలిపింది. దిగుమతుల్లో చైనా రెండో స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement