Wednesday, May 1, 2024

కంటెంట్‌ క్రియేటర్లకు గుడ్‌న్యూస్‌.. నిబంధనలు సడలించిన యూట్యూబ్‌

ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్లకు శుభవార్త చెప్పింది. యూట్యూబ్‌ పార్టనర్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించిన నిబంధనలు సడలించింది. బానిటైజేషన్‌కు అర్హత సాధించేందుకు ఉన్న సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా తగ్గించింది. చిన్న కంటెంట్‌ క్రియేటర్లు కూడా మానిటైజేషన్‌ టూల్స్‌ పొందేందుకు వీలుగా నిబంధనలు మార్చింది. ఒక పై తక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్న క్రియేటర్లు కూడా యూట్యూబ్‌ నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు.

యూబ్యూట్‌లో మానిటైజషన్‌కు అర్హత సాధించాలంటే కనీసం 1000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాల్సి ఉంది. దీంతో పాటు ఏడాదిలో కనీసం 4000 గంటల వీక్షణలు లేదా చివరి 90 రోజుల్లో కనీసం 10 మిలియన్‌ షార్ట్స్‌ వీడియోవ్యూస్‌ ఉండాఇ. యూట్యూబ్‌ కొత్త మానిటైజేషన్‌ నిబంధనల ప్రకారం ఇక నుంచి సబ్‌స్క్రైబర్ల సంఖ్య వెయ్యికి బదులు 500 మంది ఉంటే సరిపోతుంది.

- Advertisement -

చివరి 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేసి ఉండాలి. అలాగే ఏడాదిలో మూడు వేల గంటల వీక్షణలు లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్‌ షార్ట్స్‌ వ్యూస్‌ ఉండాలి. ఈ కనీస అర్హతలు సాధించిన కంటెంట్‌ క్రియేటర్లకు ఇక నుంచి యూట్యూబ్‌ మానిటైజేషన్‌ ప్రోగ్రామ్‌కు అప్లయ్‌ చేసుకోవచ్చు.

కొత్త మానిటైజేషన్‌ నిబంధనలను మొదట అమెరికా, బ్రిటన్‌, కెనడా, తై వాన్‌, దక్షిణ కొరియాలో యూట్యూబ్‌ తీసుకు వస్తోంది. త్వరలోనే మిగిలిన దేశాల్లోనూ దీన్ని అమలు చేయనుంది. కొత్త నిబంధనల మూలంగా ఇక నుంచి చిన్న కంటెంట్‌ క్రియేటర్లు కూడా యూబ్యూట్‌ నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. వీటితో పాటు సూపర్‌ థాక్స్‌, సూపర్‌ చాట్‌, సూపర్‌ స్టక్కర్స్‌ వంటి టిప్పింగ్‌ టూల్స్‌తో పాటు చానెల్‌ మెంబర్‌షిప్స్‌ వంటి సబ్‌స్క్రిప్షన్‌ టూల్స్‌ను కూడా పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement