Thursday, May 9, 2024

కర్ణాటకలోని ఆర్డీఎస్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి

కర్ణాటకలోని రాజోలి బండ డైవర్షన్ స్కీం (RDS)కు వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. ఆనకట్ట ఎగువన విస్తారంగా వానలతోపాటు తుంగభద్ర డ్యాం 30 గేట్లు ఎత్తి వరద నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో ఆర్డీఎస్‌కు వరద చేరుతోంది. ప్రస్తుతం ఆర్డీఎస్‌ ఆనకట్టకు 74,470 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. అదే స్థాయిలో దిగువ నున్న సుంకేసుల బ్యారేజీ కి చేరుతుంది. ప్రస్తుతం 11 అడుగుల నీటి మట్టం నిల్వ ఉంది. సాయంత్రానికి వరద తాకిడి పెరిగే అవకాశం ఉందని ఆర్డీఎస్ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల ప్రజలు నదిలోకి వెళ్లొద్దని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement