Friday, May 3, 2024

పెరిగిన వ్యవసాయ కార్మికుల ద్రవ్యోల్బణం

ఆహార పదార్ధాల రేట్లు పెరగడంతో గ్రామీణ వ్యవసాయ కార్మికులు,ఇతర గ్రామీణ వర్కర్ల రిటైల్‌ ద్రవ్యోల్బణం వరసగా 6.60, 6.82 శాతానికి పెరిగింది. జూన్‌లో ఇది గ్రామీణ వ్యవసాయ కార్మికుల రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.43 శాతం. గ్రామీణ కార్మికుల రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.76 శాతంగా నమోదైంది. 2021 జూన్‌లో ఇది వరసగా 3.92, 4.09 శాతంగా నమోదైందని కేంద్ర కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గ్రామీణ వ్యవసాయ కార్మికుల ఆహార ద్రవ్యోల్బణం 5.38 శాతం గ్రామీణ కార్మికుల ద్రవ్యోల్బణం 5.44 శాతంగా ఉంది. ఆల్‌ ఇండియా వినియోగదారుల ధర ఇండెక్స్‌ చూస్తే గ్రామీణ వ్యవసాయ కార్మికులది 1131 పాయింట్లు, గ్రామీణ వర్కర్లది 1143 పాయింట్లుగా ఉందని తెలిపింది. గ్రామీణ ప్రాంతంలోని కార్మికుల ద్రోవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం ఆహార పదార్ధాల రేట్లు పెరగడమేనని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. ప్రధానంగా బియ్యం, గోధుమలు, జొన్నలు, పప్పులు, పాలు, చేపలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం, కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాల రేట్లు పెరగడమే ప్రధాన కారణంగా పేర్కొంది.

ప్రధానంగా వ్యవసాయ కార్మికుల ద్రవ్యోల్బణం కొన్ని రాష్ట్రాల్లో అధికంగా ఉందని ఈ ప్రకటనలో తెలిపింది. 20 రాష్ట్రాల్లో ఇది 1 నుంచి 13 పాయింట్ల వరకు ఉందని తెలిపింది. తమిళనాడులో అధికంగా 1301 పాయింట్లు, 890 పాయింట్లతో హిమాచల్‌ ప్రదేశ్‌ చివరి స్థానంలో ఉన్నాయి. గ్రామీణ వర్కర్ల ద్రవ్యోల్బణం విషయంలోనూ 1290 పాయింట్లతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. 942 పాయింట్లతో హిమాచల్‌ప్రదేశ్‌ చివరి స్థానంలో నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement