Thursday, April 25, 2024

Delhi | జమ్మూలో అట్టహాసంగా శ్రీవారి ఆలయ ప్రారంభోత్సవం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జమ్ము-కాశ్మీర్ రాష్ట్రం జమ్ము నగర సమీపంలోని మాజిన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన, మహా సంప్రోక్షణ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 62 ఎకరాల ప్రాంగణంలో అందమైన శివాలిక్ అడవుల్లో నిర్మించిన ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జూన్ 3వ తేదీన పుణ్యాహవచనంతో ప్రారంభమైంది. ఆరు రోజుల పాటు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది.

- Advertisement -

చివరి రోజైన గురువారం జరిగిన ధ్వజాహరోహణం, సర్వదర్శన ప్రారంభ కార్యక్రమానికి కేంద్రమంత్రి హాజరయ్యారు. శ్రీవారి ఆలయం.. జమ్ము ప్రాంతంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా నిలిచింది. గురువారం జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రితోపాటుగా జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, స్థానిక ఎంపీ జుగల్ కిశోర్ శర్మ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జమ్ము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి ప్రెసిడెంట్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో పాటు వేద పండితులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement