Friday, May 3, 2024

Delhi: ‘పంచతంత్రం’ … కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఇదే…

మహిళలకు ఇంపార్టెన్స్
యువతకు ఉపాధి
రైతులకు వెన్నుదన్ను
శ్రామికులకు భరోసా
అన్నిటికీ సమన్యాయం

ఆంధ్రప్రభ స్మార్ట్, ఢిల్లీ ప్రతినిధి – గ్యారెంటీ గ్యారెంటీ అని మోదీ చెబుతారు… కానీ ప్రజల దగ్గరకు ఈ గ్యారెంటీ చేరలేదు. కాంగ్రెస్ పార్టీ అలా కాదు. చెప్పింది చెప్పినట్టు చేస్తుందని ఆ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే అన్నారు. లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే న్యాయ్ పత్ర -2024 పేరుతో 48 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల కిందట మోదీ మాట్లాడుతూ, రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, కానీ ప్రజలకు ఇప్పటి వరకూ ఉద్యోగాలు చేరలేదని ఖర్గే విమర్శించారు. పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష అందిస్తాం. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం ఖర్గే హామీ ఇచ్చారు.

సంపన్నుల కోసమే మోదీ పాలన : చిదంబరం
మోదీ పాలనలో ప్రజాస్వామ్యం బలహీనపడింది. ఒక్క శాతం ఉన్న ధనికుల కోసమే బీజేపీ ప్రభుత్వం పాలన చేస్తుంది. నిరుపేదలను మోదీ సర్కార్‌ మోసం చేసిందని, దేశంలోని అన్నిరంగాల్లో విధ్వంసం జరిగిందని, ధరలు పెరిగాయి. నిరుద్యోగం పెరిగిపోయింది వృద్ధిరేటు పెరగలేదు, ఐదేళ్లుగా వేతనాలు కూడా పెరగలేదని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు. యూపీఏ హయాంలో 7.8శాతం వృద్ధిరేటు నమోదైంది దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం. 30 లక్షల ఉద్యోగాల కల్పన, రూ.5వేల కోట్లతో యువతకు స్టార్టప్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామని చిదంబరం హామీ ఇచ్చారు.

ఐదు గ్యారెంటీలు .. 25 హామీలు
ఐదు గ్యారెంటీలు 25హామీలతో ఈ మేనిఫెస్టోలో మహిళలు, రైతులు, యువతకు, పెద్దపీట వేసింది కాంగ్రెస్. సమ న్యాయ్( హిస్సేరీ న్యాయ్), కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్ పేర్లతో ఐదు గ్యారెంటీలను మేనిఫెస్టోలో రూపొందించింది. ఒక్కో గ్యారెంటీ కింద ఐదేసి హామీలు.. మొత్తం 25 హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. యువతకు ఉద్యోగాలు, రైతులకు కనీస మద్దతు ధర, కార్మికులకు రోజుకు కనీస వేతనం, కులగణన, ఆర్థిక సర్వే, సురక్షిత రాజ్యాంగం, పౌరుల హక్కులకు ప్రాధాన్యం ఇచ్చింది.

- Advertisement -

పంచ్ న్యాయ్ ఇలా …
గృహలక్ష్మి పథకంలో మహిళల ఖాతాల్లోకి నగదు జమ, రూ.450కి వంటగ్యాస్ సిలిండర్, బస్సు ప్రయాణంలో మహిళలకు రాయితీ, రైతులకు కనీస మద్దతు ధరపై హామీ, వ్యవసాయ పరికరాల ధరలపై జీఎస్టీ మినహాయింపు, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు, కులగణన ఆధారంగా రిజర్వేషన్ల కల్పన, రిజర్వేషన్లపై 50శాతం పరిమితి తొలగింపు, న్యాయ్ యోజనలో పేద కార్మిక కుటుంబాలకు ఏడాదికి రూ.72 వేల సహాయం, రైల్వే ఛార్జీల తగ్గింపు, వృద్ధులకు టికెట్లపై రాయితీ, రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత, చిన్నతరహా పరిశ్రమల రుణాలను మాఫీ చేసి.. తక్కువ వడ్డీకి రుణాల పంపిణీ వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు, పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష అందిస్తాం. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం. కిసాన్‌ న్యాయ్‌ పేరుతో రైతులను ఆదుకుంటాం. పంటలకు కనీస మద్దతు ధర చట్టం తీసుకు వస్తాం. రైతులను ఆదుకునేందుకు రుణసాయం చేస్తాం అని మ్యేనిఫెస్టోలో కాంగ్రెస్ స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement