Sunday, April 28, 2024

AP: తాడిపత్రిలో.. రూ.1.31 కోట్లు స్వాధీనం

తాడిపత్రి టౌన్, ఏప్రిల్ 1 (ప్రభన్యూస్): అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.1.31 కోట్ల రూపాయలను షేక్ మస్తాన్ వలి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల్లో భాగంగా డీఎస్పీ సీఎం గంగయ్య ఆదేశాల మేరకు సిఐలు మురళీకృష్ణ, లక్ష్మి కాంత్ రెడ్డి తన సిబ్బందితో కలిసి పట్టణంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో షేక్ మస్తాన్ వలి, షేక్ నజీమున్నీషా, షేక్ రషీదా అనే ముగ్గురు కలిసి అనుమానస్పదంగా కనిపించడంతో వారిని విచారించగా వారి వద్ద ఎలాంటి అనుమతి లేకుండా కోటి 31 లక్షల 35 వేల 700 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.

అనంతరం వారి నివాసాల్లో సోదాలు నిర్వహించడం జరిగిందని, అయితే ఎలాంటి నగదు దొరకలేదన్నారు. మస్తాన్ వలి ఇతర రాష్ట్రాల్లో బంగారు కొనుగోలు చేసి తాడిపత్రిలో ఎక్కువ రేటుకు విక్రయించే వారని ఆయన తెలిపారు. డీఎస్పీ సీఎం గంగయ్య ఆధ్వర్యంలో సిఐలు మురళీకృష్ణ, లక్ష్మి కాంత్ రెడ్డి తన సిబ్బందితో కలిసి భారీ మొత్తంలో నగదును పట్టుకోవడంతో వారిని ఆయన అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement