Tuesday, April 30, 2024

పాక్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ జైలు కస్టడీ పొడిగింపు.. హైకోర్టు ఉత్తర్వులు జారీ

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు కస్టడీని 14 రోజుల పాటు పొడిగిస్తూ పాక్ ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు కస్టడీని పొడిగించినట్లు అతని న్యాయవాది మీడియాకు తెలిపాడు. ఇమ్రాన్ రిమాండ్‌ను సెప్టెంబర్ 13 వరకు పొడిగించిన అనంతరం విలేకరులతో ఖాన్ తరపు న్యాయవాది నయీమ్ పంజుతా మాట్లాడారు. బెయిల్ కోసం దరఖాస్తు సమర్పించామని, సెప్టెంబర్ 2న విచారణ జరుగుతుందని నయీమ్ తెలిపారు. ఓపెన్ కోర్ట్ ట్రయల్ కోసం కూడా ఒక అభ్యర్ధనను దాఖలు చేసామని న్యాయవాది చెప్పారు.

ప్రభుత్వ బహుమతులను చట్టవిరుద్ధంగా విక్రయించినందుకు దోషిగా తేలిన తర్వాత మిస్టర్ ఖాన్ ఆగస్టు 5న మూడు సంవత్సరాల జైలు శిక్షను విధించింది హైకోర్టు. కాగా, ఆ శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ.. ఖాన్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించి హైకోర్టు. అయితే ప్ర‌భుత్వ ర‌హ‌స్యాల‌ను బ‌హిరంగప‌రిచిన మరో కేసులో అతను ఇంకా రిమాండ్‌లో ఉన్నందున జైలు నుంచి విడుదల కాలేదు. FIA కేసు నివేదిక ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్‌లో పాకిస్తాన్ రాయబారి పంపిన రహస్య విషయాలను బహిరంగపరిచి, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నందుకు ఖాన్‌పై అధికారిక రహస్యాల చట్టం కింద అభియోగాలు మోపారు. నేరం రుజువైతే ఈ కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement