Monday, April 29, 2024

5శాతం కంటే ఎక్కవైతే.. ఆంక్షలు విధించాల్సిందే: ఐసీఎంఆర్‌

న్యూఢిల్లి : ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటం ప్రతీ ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) చీఫ్‌ బలరాం భార్గవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్‌ విజృంభణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, దేశంలో కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

కరోనా పాజిటివిటీ స్థాయి 5 శాతం కంటే ఎక్కువ అయితే.. జిల్లా స్థాయిలో ఆంక్షలు విధించాల్సి ఉంటుందని బలరాం భార్గవ్‌ హెచ్చరించారు. ఆ మేరకు ఆయన అన్ని రాష్ట్రాలకు అధికారిక సందేశాన్ని పంపినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఒమిక్రాన్‌, కరోనా విషయంలో భయాందోళనలు వ్యాపించకుండా సాయాన్ని అందిస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement