Monday, May 6, 2024

పాజిటివ్ వచ్చిందా? అయితే వ్యాక్సిన్‌కు తొందరపడొద్దు

కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం చెప్తోంది. కానీ కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ తీసుకునే విషయంపై చాలామందికి సందేహాలు నెలకొన్నాయి. తొలి డోసు వ్యాక్సిన్‌ తర్వాత పాజిటివ్‌ వస్తే రెండో డోసు తీసుకోవచ్చా? అన్న అనుమానాలు కూడా చాలామందిలో తలెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారు కరోనా వ్యాక్సిన్ కోసం తొందరపడవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పాజిటివ్ నుంచి కోలుకున్న 8 వారాల వరకు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. కరోనా నుంచి కోలుకోగానే వ్యక్తి శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయి ఉంటాయని, దీని వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని తెలిపారు. పాజిటివ్ నుంచి కోలుకున్న వ్యక్తి మంచి ఆహారం తీసుకుంటే చాలని డాక్టర్లు చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement