Monday, April 29, 2024

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌.. ఏడాదిలో 42 శాతం రిటర్న్స్‌..

ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ ఇండియా.. ఆపర్చునిటీస్‌ ఫండ్‌ను తీసుకొచ్చింది. గడిచిన ఏడాది కాలంలో 42.55 శాతం రాబడిని అందించింది. 18 శాతం బెంచ్‌మార్క్‌ను అధిగమించింది. ఫండ్‌ ఔట్‌ సైజ్‌ రిటర్న్‌లతో మెరిసింది. లార్జ్‌ క్యాప్‌, లార్జ్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌, మల్టిd క్యాప్‌ అండ్‌ ఫ్లెక్సీ క్యాప్‌తో సహా చాలా వైవిధ్యమైన ఈక్విటీ మార్గాలను అధిగమించగలిగింది. ఫండ్‌ దాని బెంచ్‌ మార్క్‌ నిఫ్టీ 500 టీఆర్‌ఐ కంటే 18.02 శాతం ఆల్ఫాను జనరేట్‌ చేసింది. జనవరి 2019లో ప్రారంభించబడిన ఈ ఫండ్‌.. ఎన్‌ఏవీ రూ.10 నుంచి 2022 ఏప్రిల్‌ 20 నాటికి రూ.18.46కు చేరుకుంది. ఈక్విటీ ఫండ్‌/కేటగిరీతో పాటు ఒక ఏడాది, రెండేళ్ల సీఏజీఆర్‌ రిటర్న్స్‌ను పరిశీలిస్తే.. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ ఇండియా ఆపర్చునిటీస్‌ ఫండ్‌ ఏడాదిలో 42.55 శాతం, రెండేళ్లలో 51.15 శాతం రిటర్న్‌ ఇచ్చింది. బెస్ట్‌ లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ ఏడాదిలో 27.69 శాతం రిటర్న్స్‌ ఇస్తే.. రెండేళ్ల కాలంలో 37.14 శాతం రిటర్న్స్‌ ఇచ్చింది. బెస్‌ లార్జ్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ విషయానికొస్తే.. ఏడాది కాలంలో 33.93 శాతం రిటర్న్స్‌ ఇస్తే.. రెండేళ్లలో 44.93 శాతం లాభాలను అందించింది. బెస్ట్‌ మల్టిక్యాప్‌ ఫండ్‌ ఏడాది కాలంలో 38.08 శాతం, రెండేళ్లలో 45.83 శాతం రిటర్న్స్‌ ఇచ్చాయి. ఇక బెస్ట్ ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్‌ రిటర్న్స్‌ విషయానికొస్తే.. ఏడాది కాలంలో 34.48 శాతం, రెండేళ్లలో 44.11 శాతం రిటర్న్‌ ఇచ్చాయి.

స్పెషల్‌ సిచువేషన్‌ ఫండ్‌ (ప్రత్యేక పరిస్థితుల ఫండ్‌)..

స్పెషల్‌ సిచువేషన్‌ ఫండ్‌ అనేది.. అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటుంది. తాజా పరిస్థితులు, సమస్యలను అంచనా వేస్తుంది. దానికి అనుగుణంగా ముందుకు వెళ్తూ.. ఇన్వెస్టర్‌కు భారీ రిటర్న్స్‌ను అందిస్తుంది. మార్కెట్‌లోని ప్రత్యేక పరిస్థితులను గుర్తించడం.. దానికి అనుగుణంగా సవరణలు చేయడమే ఈ ఫండ్‌లో ప్రధాన అంశం. 360 డిగ్రీల కోణంలో స్టాక్స్‌ను పరిశోధిస్తుంది. ఇది ఫండ్‌ మేనేజర్‌ల వద్ద అందుబాటులో ఉండే నైపుణ్యం. కంపెనీ, రంగం లేదా ఆర్థిక వ్యవస్థలో తాత్కాలిక సంక్షోభం, ప్రభుత్వ చర్య లేదా నియంత్రణ మార్పులు లేదా ప్రపంచ స్థాయి ఘటనలు లేదా అనిశ్చితి కారణంగా కూడా ఏర్పడే అంశాలు.. ప్రత్యేక పరిస్థితులను సూచిస్తాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఇండియా ఆపర్చునిటీస్‌ ఫండ్‌ సాధారణంగా.. ప్రత్యేక పరిస్థితుల కారణంగా తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న.. బలమైన కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంది. ఈ ఫండ్‌ను వెటరన్‌ ఫండ్‌ మేనేజర్‌ ఎస్‌ నరేన్‌ నిర్వహిస్తారు. వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌లో నరేన్‌ ఎంతో నిపుణుడు.

మీడియం టర్మ్‌లో మంచి ప్రాఫిట్‌..

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఈడీ అండ్‌ సీఐఓ, ఇండియా ఆపర్చునిటీస్‌ ఫండ్‌ మేనేజర్‌ ఎస్‌ నరేన్‌ మాట్లాడుతూ.. దీర్ఘ కాలికంగా ప్రత్యేక పరిస్థితుల పెట్టుబడి గణనీయమైన ఆల్ఫాను జనరేట్‌ చేస్తుంది. స్వల్ప కాలానికి సంబంధించిన అంశం అస్థిరతను తోసిపుచ్చలేనప్పటికీ.. మిడియం టర్మ్‌లో మెరుగైన రిటర్న్స్‌ ఉండటంతోనే.. ఈ వ్యూహం బలమైన రాబడిని అందిస్తుందని చెప్పుకోవచ్చు. కరోనా మహమ్మారి.. అనేక ప్రత్యేక పరిస్థితులతో పాటు అవకాశాలను తెచ్చి పెట్టింది. దాన్ని తాము పెట్టుబడిగా పెట్టామని, చివరికి తమ పెట్టుబడిదారులకు చాలా ప్రోత్సాహకరమైన పెట్టుబడి ఫలితాలను అందించామన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement