Monday, May 6, 2024

నేను ఇద్దరు పిల్లలకు తండ్రిని, రసాయనిక ఆయుధాల్లేవు.. అబద్ధం చెప్పట్లేదు : జెలెన్‌ స్కీ

ఉక్రెయిన్‌ తమపై దాడికి రసాయన ఆయుధాలు తయారు చేస్తోందని రష్యా ఆరోపించగా.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ స్పందించారు. రసాయన ఆయుధాలు తయారు చేయాలనే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. ఎప్పటికీ ఈ తరహా ఆయుధాలు తయారు చేసేదే లేదని తేల్చి చెప్పారు. రష్యా చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తాను ఇద్దరు పిల్లలకు తండ్రి అని, ఓ దేశానికి అధ్యక్షుడిని అని చెప్పుకొచ్చారు. తన భూమిపై రసాయన లేదా ఇతర సామూహిక విధ్వంసకర ఆయుధాల అభివృద్ధి చేయడం లేదన్నారు. తాను చెప్పేది నిజం అన్నారు.

ఈ విషయంలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయం కూడా ప్రపంచం మొత్తానికి తెలుసు అన్నారు. రష్యాకు కూడా తెలుసని చెప్పుకొచ్చారు. లక్షలాది మంది దేశం విడిచి వెళ్లిపోయారని, రష్యా దాడులతో కీవ్‌తో పాటు మరియుపోల్‌ ప్రజలు ఆహారం, నీళ్లకు తల్లిడిల్లిపోతున్నారన్నారు. తమపైనే జీవాయుధాన్ని ప్రయోగించేందుకు, రసాయనిక దాడి చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని విమర్శించారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే.. రష్యాపై మరిన్ని ఆంక్షలు తప్పవని హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement