Thursday, May 2, 2024

యుద్దానికి నేను సిద్దం.. రాళ్లా ? రాడ్లా ? పవన్ సంచలన వ్యాఖ్యలు..

వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్దానికి తాను సిద్ధమంటూ.. రాళ్లా..? రాడ్లా..? దేనితోనైనా యుద్దానికి సిద్ధమన్నారు. ఏరా వైసీపీ గూండాల్లారా.. ఇప్పటి వరకూ పవన్ లో సహనం, మంచితనం మాత్రమే చూశారన్నారు. ఇళ్లలో నుంచి బయటకు లాక్కొచ్చి మరీ కొడతానన్నారు. నాకు రాజకీయం తెలియదనుకుంటున్నారా ? ఈరోజు నుండే యుద్ధం మొదలు పెడతానన్నారు. ప్యాకేజీ స్టార్ అని విమర్శించే నేతలకు పవన్ చెప్పు చూపించారు. నా గుండెచప్పుడైన తెలంగాణ నుంచి ఈ పోరాట స్ఫూర్తి వచ్చిందన్నారు. ప్యాకేజీ తీసుకున్నాడనే సన్నాసి కొడుకులు ఎవరు అని అడిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement