Thursday, April 25, 2024

హైదరాబాద్ కి వరల్డ్ గ్రీన్ సిటీ 2022అవార్డ్-కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్

వరల్డ్ గ్రీన్ సిటీ 2022అవార్డు దక్కింది హైదరాబాద్ కి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బృహత్తర ప్రణాళికలకు రూపకల్పన చేయనున్న కేసిఆర్…. హైదరాబాదు నగరానికి విస్తృత ప్రచారం చేయాలని ప్లాన్‌ వేశారు. ఇందులో భాగంగానే.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పట్టణాభివృధ్గి శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అరవింద్ కూమార్, ఇతర ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌.పెట్టుబడులను మరింతగా ఆకర్షించడంతో పాటు, పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, ప్రపంచవ్యాప్తంగా అమలుకు ప్రచార ప్రణాళికలు వేస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని సుస్థిర విశ్వనగరంగా మార్చేందుకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో మౌలిక వసతులు పెంచేందుకు ఆలోచనలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement