Thursday, May 2, 2024

హ్యుందాయ్ ‘‘వెన్యూ-నైట్ ఎడిషన్’’.. మార్కెట్ లో మరో కొత్త కారు!

దిగ్గజ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఇండియన్ మార్కెట్లో వెన్యూ ఎస్‌యూవీ నైట్ ఎడిషన్‌ను విడుదల చేసింది. హ్యుందాయ్ SUV కొత్త డిజైన్, ఫీచర్లతో విడుదల చేయబడింది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన కారు ఎక్ట్సీరియర్ లుక్ చాలా బాగుంది. SUV ముందు భాగంలో హ్యుందాయ్ లోగోతో పాటు బ్లాక్ కలర్ ఫ్రంట్ గ్రిల్‌ను అందించింది కంపెనీ. కొత్త ఎడిషన్‌లో రూఫ్ పైన రైలింగ్, యాంటెన్నా, ORVM ఉన్నాయి. బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్ అందించబడ్డాయి. దీంతో కార్ లుక్ చాలా బాగుంటుంది. ఇక‌, కొత్త హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ ప్రత్యేకత, ధ‌ర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం…

మూడు వేరియంట్లలో..

హ్యుందాయ్ మూడు వేరియంట్లలో వెన్యూ నైట్ ఎడిషన్‌ను విడుదల చేసింది. వీటిలో S(O), SX & SX (O) వేరియంట్‌లు ఉన్నాయి. ఈ SUV పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ SUVలో 1.0 లీటర్ టర్బో ఇంజన్ కలదు. IMT, DCT గేర్‌బాక్స్‌లతో కూడా అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిష‌న్ ధర వివ‌రాలు..

నైట్ 1.2 లీటర్ S(O) నైట్ MT ఎడిషన్ వేరియంట్ ధర రూ. 999,990 (ఎక్స్-షోరూమ్).
1.2 లీటర్ SX నైట్ MT వేరియంట్ ధర రూ. 11,25,700 (ఎక్స్-షోరూమ్).
మూడవ వేరియంట్ 1.2 లీటర్ SX నైట్ MT డ్యూయల్ టోన్ వేరియంట్ ధర రూ. 11,40,700 (ఎక్స్-షోరూమ్).

1 లీటర్ పెట్రోల్ ఇంజన్ SX(O) నైట్ MT వేరియంట్ ధర రూ.12,65,10 (ఎక్స్-షోరూమ్).
డ్యూయల్ టోన్ 1 లీటర్ SX(O) నైట్ MT వేరియంట్ ధర రూ.12,80,100 (ఎక్స్-షోరూమ్)
నైట్ DCT వేరియంట్ ధర రూ.13,33,100 (ఎక్స్-షోరూమ్).
నైట్ DCT డ్యూయల్ టోన్ వేరియంట్ ధర రూ. 13,48,100 (ఎక్స్-షోరూమ్).

Advertisement

తాజా వార్తలు

Advertisement