Sunday, April 28, 2024

IPL 2024 SRH vs KKR | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైద‌రాబాద్..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా టోర్నీ 2024 రానే వ‌చ్చింది. కాగా, ఇవ్వాల (శనివారం) డబుల్-హెడర్ గేమ్‌లో భాగంగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) – సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లు తలపడనున్నాయి. ఇక, ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది.

సన్ రైజర్స్ కు తొలి విజయం దక్కేనా …

గతేడాది పేలవమైన ప్రదర్శన చేసిన సన్‌రైజర్‌ ఈసారి విజయంతో కొత్త సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని చూస్తోంది. చివరి మూడు సీజన్‌ల నుంచి హైదరాబాద్‌ జట్టు ప్రదర్శన నిరాశజనకంగానే ఉంది. 2021, 2022లలో పాయింట్లపట్టికలో 8వ స్థానంలో నిలిచిన ఆరెంజ్‌ ఆర్మీ.. గత సీజన్‌లో మరింత దిగజారి 10వ స్థానంతో ముగించింది. ఇక ఈ సీజన్‌లో కొత్త కెప్టెన్‌ కమిన్స్‌ సారథ్యంలో, కొత్త హెడ్‌ కోచ్‌ డానియల్‌ వెటోరి పర్యవేక్షణలో సన్‌రైజర్స్‌ టీమ్‌ ఎంత దూరం ప్రయణిస్తుందో ఆసక్తికరంగా మారింది.

అయితే ఆస్ట్రేలియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన సారథి పాట్‌ కమిన్స్‌ను ఈసారి ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీ రూ. 20.50 కోట్లు భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. అతనిపై భారీ అంచనాలు పెట్టుకుంది. టీ20 ల్లో తొలిసారి కెప్టెన్నీ చేపడుతున్నా కమిన్స్‌పై నే టీమ్‌ భారమంతా నిలబడింది. యువ ఆటగాళ్లతో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఆరెంజ్‌ ఆర్మీ సిద్ధమైంది.

- Advertisement -

జట్టులో కెప్టెన్‌ కమిన్స్‌తో పాటు ట్రావిస్‌ హెడ్‌, మార్క్‌రమ్‌, హసరంగా, ఫిలిప్స్‌, ఫజల్‌ హక్‌, క్లాసెన్‌ వంటి స్టార్‌ విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో ఎవరికీ తుది జట్టులో అవకాశం లభిస్తుందో చూడాలి. అలాగే మయాంక్‌ అగర్వాల్‌, అబ్దుల్‌ సమద్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీష్‌ కుమార్‌, భువనేశ్వర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉనద్కాట్‌, నటరాజన్‌, ఉమ్రాన్‌ వంటి కీలకమైన దేశీయ ఆటగా ళ్లున్నారు. బౌలింగ్‌లో నిలకడగా ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు బ్యాటింగే పెద్ద సమస్యగా ఉంది. ఈ విభాగంలో రాణిస్తే హైదరాబాద్‌ జట్టుకు తిరుగే ఉండదు.

బలంగా కోల్ కోతా జట్టు

మరోవైపు స్టార్‌ ఆటగాళ్లతో కూడిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మరో ట్రోఫీ కోసం ఆతృతగా ఉంది. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్‌ అయ్యార్‌ మరోసారి కేకేఆర్‌ను ముందుండి నడిపించనున్నాడు. అయ్యర్‌తో పాటు రింకూ సింగ్‌, గుర్బాజ్‌, ఫిల్‌ సాల్ట్‌, ఆండ్రీ రస్సె ల్‌, నితీష్‌ రాణా, కేఎస్‌ భరత్‌, మనీష్‌ పాండే తదితరులతో బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లోనూ ఐపీఎల్‌ మోస్ట్‌ ఎక్స్‌పెన్సీవ్‌ ప్లేయర్‌ మిచెల్‌ స్టార్క్‌, సునీల్‌ నరైన్‌, చమీరా, రూథర్‌ఫోర్డ్‌, ముజీబ్‌, సాకిబ్‌, వరుణ్‌ వంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉండ టం కేకేఆర్‌కు కలిసొచ్చే అంశం.

జట్ల వివరాలు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:

పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), అబ్దుల సమద్‌, అభిషేక్‌ శర్మ, ఐడెన్‌ మార్క్‌ర మ్‌, మార్కొ జాన్సన్‌, రాహుల్‌ త్రిపాఠి, వాషింగ్టన్‌ సుందర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, సన్వీర్‌ సింగ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, భువనేశ్వర్‌కుమార్‌, మయంక్‌ అగర్వాల్‌, నటరాజన్‌, అన్మోల్‌ ప్రీత్‌ సింగ్‌, మార్ఖండే, ఉపేంద్ర సింగ్‌, ఉమ్రాన్‌ మలిక్‌, నితీస్‌ కుమార్‌ రెడ్డి, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, షాబాజ్‌ అహ్మద్‌, ట్రావిస్‌ హెడ్‌, వనిందు హసరంగా, జయదేవ్‌ ఉనద్కాట్‌, అకాశ్‌ సింగ్‌, సుబ్రమణ్యన్‌.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌:

శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), రింకూ సింగ్‌, నితీష్‌ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్‌, ఫిల్‌ సాల్ట్‌, సునీల్‌ నరైన్‌, సుయాష్‌ శర్మ, అనుకూల్‌ రాయ్‌, ఆండ్రీ రస్సెల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా, వరుణ్‌ చక్రవర్తి, కేఎస్‌ భరత్‌, సకారియా, మిచెల్‌ స్టార్క్‌, రఘువంశీ, రమణ్‌దీప్‌ సింగ్‌, రూథ ర్‌ఫోర్డ్‌, మనీష్‌ పాండే, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, దుష్మంత్‌ చమీరా, సాకిబ్‌ హుస్సేన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement