Thursday, May 9, 2024

Delhi | హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణ ఎప్పుడు? కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి ప్రశ్నించి కోమటిరెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహాదారి నెంబర్ 65ను ప్రస్తుతమున్న 4 వరుసల నుంచి 6 వరుసల రహదారిగా విస్తరించే పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్) ప్రశ్నించారు. సోమవారం ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశం కోసం ఢిల్లీ వచ్చిన ఆయన కేంద్ర మంత్రిని కలిసి తన నియోజకవర్గం పరిధిలోని పలు రహాదారుల గురించి వినతి పత్రాలు అందజేశారు. అందులో పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్న 65వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణ అంశం కూడా ఉంది.

- Advertisement -

ఒప్పందం ప్రకారం హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థ ఇప్పటికే విస్తరణ పనులు చేపట్టాల్సి ఉందని, కానీ జాప్యం కారణంగా రహదారిపై రద్దీ పెరిగి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ఎంపీ వెంకటరెడ్డి చెబుతూ వస్తున్నారు. ఈ అంశంపై తాజాగా మరోసారి కేంద్ర మంత్రిని ప్రశ్నించగా.. మరో 2 నెలల్లో రహదారి విస్తరణ పనులు మొదలవుతాయని హామీ ఇచ్చినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. భేటీ అనంతరం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన, ఇదే రహదారిపై ఉన్న బ్లాక్ స్పాట్స్ (తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలు) గురించి కూడా కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించగా.. వాటి మరమ్మత్తు పనుల కోసం ఇప్పటికే టెండర్లను పిలిచినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement