Monday, May 6, 2024

మహిళల క్రికెట్‌కు కొత్త సెలక్టర్లు.. ఖాళీ పోస్టుల భర్తీ

మహిళల క్రికెట్‌కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న సెలక్టర్ల పోస్టులను భర్తీచేసింది. నీతూ డేవిడ్‌ ఆధ్వర్యంలోని బృందం భారత మహిళల క్రికెట్‌ జట్టుకు కొత్త సెలెక్టర్లను ఎంపిక చేసింది. మాజీ క్రికెటర్‌ శ్యామా దే షాను సీనియర్‌ జట్టుకు సె లక్టర్‌గా నియమించింది. అదేవిధంగా జూనియర్‌ జట్టు సెలక్షన్‌ కమిటీ చీఫ్‌గా వీఎస్‌ తిలక్‌ నాయుడు ఎన్నికయ్యాడు. మహిళల క్రికెట్‌ జట్టు సెలక్టర్ల కోసం బీసీసీఐ అర్హులైన వారినుంచి దరఖాస్తులను ఆహ్వనించిన మీదట తాజాగా తుది నియామకం పూర్తచేసింది.

సులక్షణ నాయక్‌, అశోక్‌ మల్హోత్రా, జతిన్‌ పరంజపె నాయకత్వంలోని క్రికెట్‌ అడ్వయిజరీ కమిటీ దరఖాస్తులను పరిశీలించింది. చివరకు శ్యామ్‌ దే షా, తిలక్‌ నాయుడు పేర్లను బీసీసీఐకి సిిఫార్లు చేసింది. నీతూడేవిడ్‌ (చైర్‌పర్సన్‌), శ్యామా దే షా, రేణు మార్గరెట్‌, హారతి వైద్య, కల్పన సీనియర్‌ జట్టుసెలక్టర్లుగా వ్యవహరిస్తారు. కాగా, జూనియర్‌ జట్టుకు తిలక్‌ నాయుడు (చైర్‌పర్సన్‌), రణదేవ్‌ బోస్‌, హర్విందర్‌ సోధీ, ప్రతీక్‌ పటేల్‌, కృష్ణన్‌ మోహన్‌ సెలక్టర్లుగా వ్యవహరించనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement