Saturday, April 27, 2024

హైదరాబాద్‌లో స్పా సెలూన్ పేరుతో వ్యభిచారం దందా.. 23 మంది అరెస్ట్

హైదరాబాద్ నగరంలో స్పా సెలూన్‌ల మాటున వ్యభిచార దందాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక స్పా ల పేరుతో వ్యభిచార దందా చేస్తున్న ముఠాలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరోసారి నగరంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు.

హెవెన్ స్పా బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ ముసుగులో వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్టు పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. అనంతరం ప్రధాన నిందితుడితో పాటు ఇద్దరు సెలూన్ మేనేజర్‌లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో 10 మంది విటులలతో పాటు 10 మంది యువతులు మొత్తం 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి రూ.73వేల నగదు, 28 సెల్ ఫోన్లు, ఒక క్రెడిట్ కార్డు, 4లక్షల రూపాయలు ఉన్న బ్యాంక్ ఖాతాను పోలీసులు సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement