Tuesday, April 16, 2024

పవన్-హరీష్‌శంకర్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

టాలీవుడ్‌లో మరోసారి గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇటీవల పవన్ పుట్టినరోజు నాడు ఓ పోస్టర్ కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. హ‌రీష్ శంక‌ర్-ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

అయితే ఈ మూవీ దేశ భ‌క్తి నేప‌థ్యంలో రూపొందుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు భ‌గ‌త్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేయ‌నున్నార‌ని సమాచారం. సినిమా క‌థ‌కు ఈ టైటిల్‌కి స‌రిగ్గా స‌రిపోతుంద‌ని మేక‌ర్స్ ఈ టైటిల్ ఫైన‌ల్ చేసిన‌ట్టు టాక్ నడుస్తోంది. ఈ మూవీలో పవన్ సరసన పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం సమకూర్చనున్నాడు.

ఈ వార్త కూడా చదవండి: వకీల్ సాబ్ సినిమా చూస్తుంటే ఆయనే గుర్తొచ్చారు: ఏపీ స్పీకర్ తమ్మినేని

Advertisement

తాజా వార్తలు

Advertisement