Thursday, May 2, 2024

Hyderabad: అలర్ట్‌.. నగరంలో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు వర్షం వచ్చే సూచనలు కనిపించలేదు.. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కూకట్​పల్లి, కేపీహెచ్​బీ కాలనీ, ఆల్విన్​కాలనీ, ప్రగతినగర్​, బంజారాహిల్స్​, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి తోపాటు ప‌లు ప్రాంతాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షం కురుస్తోంది. ప‌లు చోట్ల ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ రోడ్లపై మ్యాన్​హోల్స్​ పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని పలు ప్రధాప కూడలల్లో ట్రాఫిక్ స్థంభించడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement