Sunday, April 28, 2024

భారీగా పెరిగిన యూపీఐ లావాదేవీలు.. రోజుకు 27 కోట్లుగా నమోదు

క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, మొబైల్‌ నెంబర్‌ సాయంతో సులభంగా నగదు బదిలీ చేసే వీలున్న యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌) లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరగుతోందని ఆర్బీఐ తెలిపింది. 2016లో ప్రారంభించిన ఈ సేవలు ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది. మొత్తం డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ వాటా 75 శాతంగా ఉంది. 2017 జనవరిలో 45 లక్షల యూపీఐ లావాదేవీలు జరిగితే, 2023 జనవరి నాటికి ఈ సంఖ్య 804 కోట్లకు పెరిగింది.

- Advertisement -

2022 ఫిబ్రవరిలో సగటున రోజుకు 16 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2023 ఫిబ్రవరి నాటికి ఈ సంఖ్య రోజుకు 27 కోట్లకు చేరాయి. ఈ లావాదేవీలు విలువ పరంగా చూస్తే 2023 ఫిబ్రవరిలో 12.35 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022 ఫిబ్రవరిలో వీటి విలువ 8.27 లక్షల కోట్లు. గత మూడు నెలలుగా నెలవారీ డిజిటల్‌ లావాదేవీల సంఖ్య 1000 కోట్లకు పైగా నమోదవుతున్నాయి.

చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి..

యూపీఐతో సింగపూర్‌కు చెందిన పే నౌ అనుసంధానం ద్వారా చాలా దేశాలు భాగస్వామ్యం పట్ల ఆసక్తి చూపిస్తున్నాయని ఆర్బీఐ పేర్కొంది. త్వరలోనే ఆరు నుంచి 10 దేశాలు ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. సింగపూర్‌కు చెందిన పే నౌతో యూపీఐ ఒప్పందం చేసుకున్న తరువాత ఈ 10 రోజుల్లో సింగపూర్‌ నుంచి మన దేశానికి 120 లావాదేవీల ద్వారా నగదు వచ్చింది. మన దేశం నుంచి 22 లావాదేవీల ద్వారా సింగపూర్‌కు నగదు వెళ్లింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement