Tuesday, April 30, 2024

ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు ముందే స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ అయిన‌ ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ తో ఆఫర్ల జాతర ప్రారంభించనుంది. స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌‌‌టాప్స్, హోమ్ అప్లికేషన్స్ వంటి వివిధ రకాల ప్రొడక్ట్స్‌పై కంపెనీ బెస్ట్ డీల్స్ అందించనుంది. అయితే ఈ మెగా సేల్ ఈవెంట్ వరకు వేచి ఉండలేని వారి కోసం ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఈ జాబితాలోని మోడళ్లు, వాటిపై అందిస్తున్న ఆఫర్లను పరిశీలిద్దాం..

భారీ డిస్కౌంట్స్.. బంపర్ ఆఫర్స్..

ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్స్‌ను తాజాగా అప్‌డేట్ చేసింది. ఈ లిస్ట్‌లో నథింగ్ ఫోన్ 1, మోటో ఎడ్జ్ 30, గూగుల్ పిక్సెల్ 7, శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్13, పోకో ఎం5 వంటి మోడల్స్ ఉన్నాయి. భారీ డిస్కౌంట్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సైతం సొంతం చేసుకోవచ్చు. దీంతో మరింత తక్కువ ధరకు ఈ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.

ఇక శామ్‌సంగ్ గెలాక్సీ F13 రూ.11,999 ధరతో లాంచ్ కాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,199కు లిస్ట్ అయింది. అంటే ఈ ఫోన్‌పై కంపెనీ రూ.2800 డిస్కౌంట్‌ ప్రకటించింది. నథింగ్ ఫోన్ 1 ప్రస్తుతం సైట్‌లో రూ. 23,999కి లిస్ట్ అయింది. లాంచ్ అయిన సమయంలో దీని ధర రూ. 32,999. అంటే రూ.9000 డిస్కౌంట్‌తో ఈ హ్యండ్‌సెట్‌ను సొంతం చేసుకోవచ్చు.

- Advertisement -

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 7‌పై ఫ్లిప్‌కార్ట్ తాజాగా బెస్ట్ డీల్ అందిస్తోంది. ఈ డివైజ్ భారత్‌లో రూ.59,999 ధరతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇది రూ.36,999తో లిస్ట్ అయింది. అంటే దీనిపై ఫ్లిప్‌కార్ట్ ఏకంగా రూ.23,000 భారీ డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం.

ఇతర ఆఫర్లు..

ఒప్పో A17K భారత్‌లో రూ.10,499 ధరతో లాంచ్ కాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7999కే సొంతం చేసుకోవచ్చు. రెడ్‌మీ నోట్12ను రూ.10,799కి కొనుగోలు చేయవచ్చు. ఇది రూ.17,999 ధరతో లాంచ్ అయింది. రియల్‌మీ సీ55 డివైజ్‌ను ఇప్పుడు రూ.9,499కే కొనుగోలు చేయవచ్చు.

మోటోరొలా మోడల్స్ ఆఫర్స్ వివరాలు..

ఒప్పొ రెనో 10 ప్రో 5G పై కూడా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ప్రకటించింది. దీన్ని రూ.35,999 డిస్కౌంట్ ధరకు లిస్ట్ చేసింది. మోటోరొలా G14, G32 లాంచ్ ధరలు వరుసగా రూ.9,999, రూ.10499 కాగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఇవి రూ.8,099, రూ.8.999కే అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్‌‌తో ఈ స్మార్ట్‌ఫోన్లను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఫ్లిప్‌కార్ట్ అధికారిక పోర్టల్ లేదా యాప్ చెక్ చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement