Friday, March 15, 2024

ఎన్టీఆర్ 30కి హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్.. ప్రకటించిన మేకర్స్

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న లేటెస్ట్ మూవీ #NTR30. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన లాంచ్ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జనతా గ్యారేజ్ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత నటుడు ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కలిసి చేస్తున్న రెండవ సినిమా ఇది.

అయితే ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ వర్క్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఆయన చేసిన హాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో కొన్ని మిషన్ ఇంపాజిబుల్: ఘోస్ట్ ప్రోటోకాల్, ట్రాన్స్‌ఫార్మర్స్: ది లాస్ట్ నైట్, ప్రిడేటర్ & పెర్ల్ హార్బర్ వంటి అద్బుతమైన సినిమాలు ఉన్నాయి. ఈ స్టంట్ మాస్టర్ ప్రభాస్ నటించిన సాహో సినిమాకి కూడా పనిచేశాడు. ప్రస్తుతం కాన్సెప్టులైజేషన్ దశలో ఉన్న ఎన్టీఆర్ 30కి సంబంధించిన మేజర్ యాక్షన్ సీక్వెన్స్‌లకు ఆయనే కొరియోగ్రఫీ చేస్తారని అంటున్నారు.

- Advertisement -

తారక్ ఫ్యాన్స్‌కి ఇది కచ్చితంగా శుభవార్తే. భారతదేశం మరచిపోయిన తీర ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో పాటు యువసుధ ఆర్ట్స్ ఈ మూవీని నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చేందుకు ఎంపికయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement