Thursday, April 25, 2024

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు.. 12న‌ పోలింగ్‌, ఏర్పాట్లు పూర్తి…

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లి ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. శనివారం పోలింగ్‌ జరుగనుంది. మొత్తం 68 స్థానాలకూ ఒకేదశలో పోలింగ్‌ నిర్వహణకు అధికారుల విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఆయా పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలతో సిబ్బంది చేరుకున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లి స్థానాలు 68. ఈ సీట్ల కోసం సుమారు 400 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 55.92 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అన్ని సీట్లలో పోటీ చేస్తున్నది. #హమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లి ఎన్నికల ఫలితాలు గుజరాత్‌ అసెంబ్లి ఎన్నికలతోపాటే డిసెంబర్‌ 8వ తేదీన ఫలితాలు వెల్లడించబోతున్నారు.

ఎన్నికకు 48 గంటల ముందు నుంచి ప్రచారంపై అమలు నిషేధం అమల్లోకి వచ్చింది. పోలింగ్‌ తేదీల విడుదలకు ముందు నుంచే పార్టీలు ఇక్కడ ప్రచారం మొదలు పెట్టాయి. కాంగ్రెస్‌ లేదా బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఆప్‌ ఇప్పుడు ఉనికి కోసం ప్రయత్నిస్తున్నది. అధికార బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ విస్తృతంగా ప్రచారం చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరే తమను మళ్లి అధికారంలోకి తెస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నది.

కాగా, అధికార పార్టీ ఇచ్చిన హామీలు గాలికి వదిలిపెట్టారని, అవే తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్‌ భావిస్తున్నది. బీజేపీ వైపు పార్టీ సీనియర్‌ నేతలు రాష్ట్రంలో పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్‌ నుంచి ప్రియాంక గాంధీ ఈ రాష్ట్రంలో ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీల మధ్య త్రిముఖ పోరు సాగింది.

హిమాచల్‌ ఓటర్లకు ప్రధాని మోదీ లేఖ

పోలింగ్‌కు ఒక రోజు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీశుక్రవారం ఓటర్లకు లేఖ రాశారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం వస్తే అభివృద్ధి సాగుతుందని మోడీ తన లేఖలో పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధిని వేగవంతం చేసిందని మోడీ పేర్కొన్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన #హమాచల్‌ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే మళ్లిd బీజేపీ అధికారంలోకి రావాలని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

ఎగ్జిట్‌, ఒపీనియన్‌ పోల్స్‌పై నిషేధం

భారత ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. #హమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌లలో ఎగ్జిట్‌పోల్‌ అంచనాల ప్రసారం, ప్రచురణను నిరోధించేలా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవంబర్‌ 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్‌ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను ప్రచురించడాన్ని నిషేధిస్తూ పోల్‌ ప్యానెల్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement