Thursday, May 16, 2024

పోలీసుల ముందే చీర విప్పిన హిజ్రా

హైదరాబాద్ నగరంలో హిజ్రాల ఆగడాలు మితిమీరుతున్నాయి. నడి రోడ్డుపై హిజ్రాలు అర్థ నగ్న ప్రదర్శనతో బరితెగించి, డబ్బుల కోసం వేధిస్తున్నారు. మల్కాజిగిరి పీస్ పరిధిలో ఉన్న వైన్స్ వద్ద ఆదివారం నాడు కొందరు హిజ్రాలు డబ్బుల కోసం వైన్స్ సిబందిపై దాడికి దిగారు. బట్టలు విప్పి జుగుప్సాకరంగా వ్యవహరించారు. అర్ధనగ్నంగా హిజ్రాలు ప్రవర్తించిన తీరుతో స్థానికులు ఇబ్బందికి గురయ్యారు.

హిజ్రాల అగడాలతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులను చూసిన హిజ్రాలు మరింత రెచ్చిపోయారు. ఓ హిజ్రా ఏకంగా పోలీసుల ముందే చీర విప్పి హంగామా సృష్టించింది. కాగా హిజ్రాల తీరు కలవరానికి గురిచేస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement