Sunday, May 5, 2024

అన్న రూల్స్ చెబుతాడు… కానీ పాటించడు

ఇటీవల కాలంలో హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకు వస్తే మనకి తెలియకుండానే ఫోటోలు తీసి ఫైన్ కట్టాలంటూ ఫోటోలను మనకే పంపిస్తున్నారు పోలీసులు. అయితే కొన్ని సార్లు ఫోటోలు కాకుండా డైరెక్ట్ గానే ఫైన్ వేస్తున్నారు. మరి కొన్ని సార్లు అన్నీ ఉన్నా ఫైన్ లు వేస్తారు. ఇదేంటి అని అడిగితే చేయి చేసుకున్న సంఘటనలు కూడా లేకపోలేదు. కానీ పోలీసులు మాత్రం ఏమైనా చెయ్యొచ్చు. హెల్మెట్ లేకుండా వెళ్లొచ్చు, త్రిబుల్ రైడ్ చెయ్యొచ్చు. అడిగే నాధుడే లేడు. ఎందుకంటే వాళ్ళు పోలీసులు.

అయితే సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్స్ అలా చేసిన పోలీసులను ఏకిపారేస్తున్నారు. అన్న రూల్స్ పెడతారు పాటించరు అంటూ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. సామాన్య ప్రజలపైన అయితే ఫైన్ లు వేస్తారా మీరు పాటించకుండా అందరికి ఎందుకు చెప్పటం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కానీ పోలీసులు మాత్రం హెల్మెట్ తప్పని సరి అని ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు మీద పోస్ట్ లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement