Sunday, April 28, 2024

Floods | హరిద్వార్‌కు హై అలెర్ట్‌.. ప్రమాదకరస్థాయికి గంగానది

గంగానదిలో నీటిమట్టం 293 మీటర్ల హెచ్చరిక స్థాయికి చేరుకోవడంతో హరిద్వారా జిల్లా మేజిస్ట్రేట్‌ నగరానికి హై అలెర్ట్‌ జారీ చేశారు. హరి కా పౌరీ సమీపంలో భీమ్‌గోడ బ్యారేజ్‌కు చెందిన గేటు ఒకటి దెబ్బ తినడంతో నదిలో నీటిమట్టం పెరిగింది. దీంతో నది దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఘాట్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గంగా నదిలో నానాటికి పెరిగిపోతున్న నీటిమట్టం, రాష్ట్రంలో పలు చోట్ల కుండపోతగా వర్షాలు కురుస్తున్న కారణంగా ఉత్తరాఖండ్‌లో రెడ్‌, ఆరెంజ్‌ అలెర్ట్‌లను భారత వాతావరణ విభాగం(ఐఎండీ) జారీ చేసింది. స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ ఇచ్చిన సమాచారం మేరకు భీమ్‌గోడ బ్యారేజ్‌కు చెందిన ఒకటవ నెంబర్‌ గేటు దెబ్బతింది. దీంతో దిగువ ప్రాంతాలకు పెద్ద ఎత్తున వరద నీరు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. అప్రమత్తమైన అధికారులు దిగువ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటను తావులేని విధంగా ప్రజలను రక్షించే పనిలో తలమునకలై ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement