Monday, April 29, 2024

తేజ స‌జ్జ బ‌ర్త్ డే- ఆక‌ట్టుకుంటోన్న హ‌నుమాన్ పోస్ట‌ర్

జాంబిరెడ్డి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తేజ స‌జ్జ‌. ఈ చిత్రం సూప‌ర్ హిట్ట‌యింది. కాగా నేడు తేజ స‌జ్జ బ‌ర్త్ డే.ఈ సంద‌ర్భంగా హ‌నుమాన్ చిత్రం నుండి పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. దసరాకి ఈ సినిమా నుంచి బిగ్ అప్ డేట్ ఉంటుందని ప్రశాంత్ వర్మ మరింత ఆసక్తిని పెంచారు. తేజ సజ్జ సరసన నాయికగా అమృత అయ్యర్ నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. కాన్సెప్ట్ ఏమిటా అనే కుతూహలం అందరిలో మొదలయ్యేలా చేసింది. ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ రీసెంట్ గా అయితే రాలేదు. కాగా తేజ సజ్జ పుట్టినరోజు కావడంతో, ఆయనకి విషెస్ చెబుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. తలపాగా చుట్టి .. ఎద్దులబండిపై వెళుతూ, ఒక గ్రామీణ కుర్రాడిగా ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ మాస్ లుక్ లో ఆయన ఆకట్టుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement