Monday, April 29, 2024

శివ‌కార్తికేయ‌న్ కి మ‌రో హిట్ట్.. 100కోట్ల క్ల‌బ్ లో ‘డాక్ట‌ర్’..

సస్పెన్స్ థ్రిల్లర్లు .. యాక్షన్ చిత్రాలు చేయడంలో మ‌హాదిట్ట నెల్స‌న్ దిలీప్ కుమార్. రీసెంట్ గా ఆయ‌న తెర‌కెక్కించిన చిత్రం డాక్ట‌ర్. ఈ మూవీలో హీరోగా శివ‌కార్తికేయ‌న్ న‌టించాడు. శివ కార్తికేయన్ సరసన నాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. కాగా అక్టోబర్ 9వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా, 25 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా శివకార్తికేయన్ కృతజ్ఞతలు తెలియజేశాడు. కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రియాంక అరుళ్ మోహన్ కి ఈ సినిమా ఊరటనిచ్చినట్టే. తమిళంలో శివకార్తికేయన్ కి మంచి క్రేజ్ ఉంది. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చిన శివకార్తికేయన్ అంచలంచెలుగా ఎదిగాడు. తనకి నచ్చిన కథలను చేయడం కోసం నిర్మాతగా కూడా మారాడు. అలా ఆయన నిర్మించిన సినిమానే ‘డాక్టర్. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement