Thursday, May 16, 2024

ధ‌మాకా మాస్ దావ‌త్ – సెప్టెంబ‌ర్ 23న రిలీజ్

వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌. ప్ర‌స్తుతం ఆయ‌న ధమాకా, రావణాసుర, టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. బీమ్స్‌ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా… కార్తీక్‌ ఘట్టమనేని కెమెరామెన్‌ గా వ్యవహరించనున్నారు. తాజాగా థమాకా సినిమా నుంచి.. అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది. ఈ సినిమా టైటిల్ ట్రాక్ గా ధమాకా మాస్ దావత్ ను ఈ సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల ఒక నిమిషానికి రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా అనౌన్స్ చేసింది చిత్రం బృందం. ఈ మేరకు ఓ పోస్టర్ ని కూడా వదిలింది. ఈ అప్డేట్ తో మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మ‌రి ఈ చిత్రం ర‌వితేజ‌కి ఏమేర‌కు విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement