Monday, May 20, 2024

నీ నవ్వు నన్ను మళ్లీ నీతో ప్రేమలో పడేలా చేస్తుంది.. మిహీక‌

నీ న‌వ్వు న‌న్ను మ‌ళ్లీ నీతో ప్రేమ‌లో ప‌డేలా చేస్తుంద‌ని పోస్ట్ పెట్టింది న‌టుడు రానా భార్య మిహీక‌. ప్రేమికులరోజు సంద‌ర్భంగా త‌న భ‌ర్త‌కి శుభాకాంక్షలు తెలిపింది మిహీక. హ్యపీ వాలంటైన్స్ డే అంటూ ఇన్స్టాలో పోస్ట్ ఫిబ్ర‌వ‌రి 14న అంతర్జాతీయ ప్రేమికుల దినోత్సవం. ఈ సందర్భంగా తన భర్త, సినీ నటుడు రానాను ఉద్దేశించి ఆయన భార్య మిహీకా బజాజ్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. తన కలల మనిషికి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అని ఆమె ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ‘స్ట్రాంగ్, స్వీట్, అందం, అద్భుతం ఇలా నా గురించి చెప్పుకుంటూ పోవడానికి పదాలు చాలడం లేదు. నీవు నన్ను ఎంతో ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు. సరదాగా అంటున్నా. నీ పనుల నిమిత్తం నీవు నాకు చాలా రోజులు దూరంగా ఉంటూ నన్ను బాధ పెట్టొచ్చు. కానీ నీ ఆ నవ్వు నన్ను మళ్లీ నీతో ప్రేమలో పడేలా చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement