Thursday, May 2, 2024

ఓటీటీలో విక్ర‌మ్ – క‌మ‌ల్ హాస‌న్ ఫ్యాన్స్ కి పండ‌గే

ద‌శాబ్దాల త‌ర్వాత విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ సిల్వర్ స్క్రీన్ పై విక్ర‌మ్ చిత్రంతో విశ్వరూపం చూపించారు.
దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్క్రీన్ ప్లే, యాక్షన్ సన్నివేశాలు మ్యాజిక్ చేశాయి. ఫహద్ నటన, విజయ్ సేతుపతి విలనిజం సినిమాను మరో స్థాయికి చేర్చాయి. అనిరుధ్ బీజీఎం విక్రమ్ సినిమాకు ప్రాణం పోసింది. ఇక ఫైనల్ లో సూర్య ఎంట్రీ మ్యాజిక్ చేసింది. మొత్తంగా విక్రమ్ ని లోకేష్ కనకరాజ్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు. కాగా విక్రమ్ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. విక్రమ్ విడుదలైన నాలుగు వారాలు పూర్తి కాగా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విక్రమ్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించింది.

జులై 8 నుండి విక్రమ్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. దీంతో విక్రమ్ మూవీ అభిమానులు మరోసారి ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయనున్నారు. ఇక విక్రమ్ కి సీక్వెల్ ఉంటుందని లోకేష్ కనకరాజ్ ప్రకటించిన నేపథ్యంలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్2 తర్వాత ఆ స్థాయిలో సత్తా చాటింది విక్రమ్ మూవీ. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన విక్రమ్ సంచలన విజయం నమోదు చేసింది. విడుదలైన అన్ని భాషల్లో విక్రమ్ రికార్డు వసూళ్లు రాబట్టింది. బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ రీత్యా ఆర్ ఆర్ ఆర్ కంటే విక్రమ్ భారీ లాభాలు అందించింది. డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement