Friday, April 26, 2024

హీరోయిన్స్ కి పోటీగా.. స్నేహారెడ్డి గ్లామ‌ర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. స్టైలిష్ ట్రెండీ వేర్ దర్శించిన స్నేహారెడ్డి ఆసక్తికర వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో స్నేహారెడ్డి నర్సరీలో మొక్కల మధ్య గడిపారు. ‘మన చుట్టూ మొక్కలు ఉంటే.. అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి. వాటిని చూస్తే ప్రేమలో పడిపోతాం. వాటి పోషణ చూసుకోవడం ఆహ్లాదం కలిగిస్తుంది. అందుకే నాకు నర్సరీ అత్యంత ఇష్టమైన ప్రదేశం..’ అని మొక్కలంటే తనకు ఎంత ఇష్టమో తెలియజేశారు. మొక్కలపై ఆమెకున్న ప్రేమను అటుంచితే స్నేహారెడ్డి స్టైలిష్ లుక్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. ఆమె చాలా గ్లామరస్ గా ఉన్నారు. టాప్ మోడల్స్, స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా స్నేహారెడ్డి లుక్ ఉంది.స్నేహారెడ్డి ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అంటే న‌మ్మ‌డం క‌ష్ట‌మే. హీరోయిన్స్ కే పోటీ ఇచ్చే గ్లామ‌ర్ ఆమె సొంత‌మ‌నే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement