Thursday, May 16, 2024

Big Story: విస్తారంగా వర్షాలు, విజృంభిస్తున్న విష జ్వరాలు.. పలు జిల్లాల్లో సీజనల్‌ వ్యాధుల తాకిడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలతోపాటు మైదాన ప్రాంతాల్లోని ప్రజలు మలేరియా, డెంగ్యూ , టైఫాయిడ్‌ జ్వరాలతో అల్లాడిపోతున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారికూడా మలేరియా ప్రభావం చూపుతోంది. మలేరియాతోపాటు డెంగ్యూ, టైఫాయిడ్‌, న్యూమేనియా, చికెన్‌గున్యా, మెదడువాపు, ఫైలేరియా, అతిసారం తదితర వ్యాధులు విజృంభిస్తున్నాయి. భద్రాద్రికొత్తగూడెం, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం రోజూ పదుల సంఖ్యలో సీజనల్‌ వ్యాధులతో జనం ఆసుపత్రులకు వస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెందడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.

సీజనల్‌ వ్యాధులతోపాటు కరోనా కూడా విజృంభిస్తుండడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులన్నీ జ్వర పీడితులతో నిండిపోతున్నాయి. విషజ్వరాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో పలువురు గిరిజన, ఆదీవాసీలు ప్రాణాలు కోల్పోతున్నారు. విష జ్వరాలు విజృంభిస్తున్నా ఎజెన్సీ, మారుమూల అటవీ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు, ఆరోగ్య కేంద్రాల్లో వైద్య, ఆరోగ్య సిబ్బంది పరిమిత సంఖ్యలో ఉండడంతో సకాలంలో ఆదివాసీలకు వైద్యం అందడం గగనంగా మారుతోంది. సీజనల్‌ జ్వరాలకు తోడు కరోనా కూడా విజృఒభిస్తుండడంతో జనం బెం బేళెత్తిపోతున్నారు. జలుబు, దగ్గుతోపాటు ఇతర లక్షణాలతో అనేక మంది ఆసుపత్రులకు రావడం సర్వసాధారణంగా మారుతోంది. దీంతో సోకింది కరోనానా.?, లేక విష జ్వరమా అన్నది తేలియక రోగులు ప్రయివేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.

ఇంటింటి సర్వే ద్వారా వ్యాధుల కట్టడి..

విష జ్వరాలు రాష్ట్రాన్ని వణికిస్తుండడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మూడెంచెల వ్యూహంతో విష జ్వరాలను కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. విషజ్వరాలపై అవగాహన కల్పించడంతోపాటు జ్వరాల బారిన పడిన వారిన గుర్తించి, వారికి వెంటనే వైద్య సదుపాయం అందిస్తున్నారు. సీజనల్‌ వ్యాధులతోపాటు కరోనా కూడా విజృంభిస్తుండడంతో ఇంటింటి సర్వే చేపట్టేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నద్ధమవుతోంది. ఆశా వర్కర్లు రానున్న 15 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో సర్వే నిర్వహించేందుకు ఏర్పాటుఉ చేస్తున్నారు. సాధారణ జ్వరాలు వచ్చిన వారిని గుర్తించి ఇంటి వద్దే మందులు అందించనున్నారు. దోమల నివారణకు దోమ తెరలు ఎంత మంది వాడుతున్న్‌ారు..?; తదితర వివరాలను సేకరించనున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement