Sunday, April 28, 2024

TS | రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ కేంద్రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష హెచ్చరిక జారీ అయింది. ఈనెల 20న రాష్ట్రంలోని కొమరంబీం ఆసీఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు పసుపు హెచ్చరికలను జారీ చేసింది.

మరోవైపు… ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మంగళవారం రాష్ట్రంలోని పెద్దపల్లిచ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావారణశాఖ తెలిపింది.

అదేవిధంగా ఈ నెల 20న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఆదిలాబాద్‌, కొమరంబీం ఆసీఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడా కురుస్తాయని తెలిపింది. మిగతా రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement